15-07-2025 11:23:35 AM
నూతనకల్,(విజయక్రాంతి): ఆరోగ్య మహిళ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారిని ఆశ్రిత రెడ్డి అన్నారు. ప్రతి మంగళవారం మండల కేంద్రం లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో ఆరోగ్య మహిళా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళలు ఎలాంటి సంకొచం లేకుండా తమ ఆరోగ్య సమస్యలను వైద్యులకు తెలపాలన్నారు. 137రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు.ఈ కార్యక్రమం లో సిహెచ్ఓ చరణ్ నాయక్, వైద్య సిబ్బంది తారమ్మ, వెంకట్ రెడ్డి, సీతారాంరెడ్డి తదితరులు ఉన్నారు.