15-07-2025 12:00:00 AM
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
గద్వాల్ టౌన్ జూలై 14 : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం గద్వాల నియోజకవర్గానికి సంబంధించి పలు గ్రామాలకు పట్టణానికి చెందిన 678 మంది లబ్ధిదారులకుకళ్యాణ లక్ష్మి షాదీమూరక్ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పేద ఇంటి ఆడపడుచులకు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని అధికార పార్టీకి మద్దతు తెలిపానన్నారు.మహిళలు ఈ కళ్యాణలక్ష్మి డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు .ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.