calender_icon.png 15 July, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. పోలీసుల అదుపులో భార్య

15-07-2025 09:22:48 AM

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో(Yadadri Bhuvanagiri) జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. సోమవారం రాత్రి మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద బైకు ను కారు ఢీకొట్టింది. ట్రాక్టర్ షోరూమ్ మేనేజర్ స్వామి(38) బైకుపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. స్వామి స్వగ్రామం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామం. స్వామి ప్రమాదంలో చనిపోయినట్లు పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. కాగా, భార్య చంపించి ఉంటుందని స్వామి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు స్వామి భార్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. మోత్కూరుతో పాటు వలిగొండ, ఆత్మకూరులోనే స్వామి పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది రోడ్డు ప్రమాదమా? లేక హత్యా అనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.