ఐలమ్మ జీవితం ఆదర్శం
10-09-2025 10:15 PM
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్..
సంగారెడ్డి (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు సాధించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్(MLA Chinta Prabhakar) అన్నారు. ఐలమ్మ 40వ వర్దంతి సందర్భంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తొలి భూ పోరాటానికి సామాజిక న్యాయానికి నాంది పలికిన ధైర్యశాలి, వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. ఎన్నో ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న ఐలమ్మ వీరత్వాన్ని ప్రతి ఒకరూ ఉద్యమ స్ఫూర్తిగా తీసుకొని ఆమె అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






