ఘనంగా ప్రారంభమైన టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్
హాజరైన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, శశాంక
సంగారెడ్డి, జూన్ 10 : తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఉద్యో గుల వార్షిక క్రీడా పోటీలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబరాలకు టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ నిరంతరం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని చెప్పారు. క్రీడల ప్రధాన ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదని, అందరూ కలిసికట్టుగా పాల్గొనడమే అసలైన విజయమని ఆమె పేర్కొన్నారు.
ఉద్యోగుల మధ్య ఐక్యత పెంచడానికి, స్నేహభావం చాటడానికిఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందించడానికి ఈ పోటీలు తోడ్పడతాయని వివరించారు. క్రీడాకారులందరూ జట్టు స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ క్రీడా వేడుకల్లో భాగంగా సంస్థకు చెంది న పురుష, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్య లో పాల్గొనడంతో స్టేడియంలో సందడి వా తావరణం నెలకొంది. రెండు రోజుల పాటు సాగే ఈ మీట్లో అథ్లెటిక్స్, క్రికెట్, బ్యాడ్మింటన్ పోటీల్లో సిబ్బంది పాల్గొన్నారు.






