ప్రజల ఆశీస్సులే.. నా బలం..
ఎమ్మెల్యే సత్యనారాయణ
బెజ్జంకి, జూన్ 10 : రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన వేడుకలు బుధవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీస్సులే తనకు మరింత బాధ్యతను పెంచాయని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్నానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. మానకొండూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్, బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షులు లింగాల శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు గుడెల్లి శ్రీకాంత్, డైరెక్టర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






