calender_icon.png 18 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్న ఆశయ సాధనలో కొనసాగుతా

17-09-2025 10:17:35 PM

విగ్రహ ఆవిష్కరణ తరలిరండి

కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకల అభినవరెడ్డి

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండల దివంగత రాష్ట్ర నాయకులు నూకల నరేష్ రెడ్డి ఆశయ సాధనలో కొనసాగుతానని అన్నారు. నూకల నరేష్ రెడ్డి ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకల అభినవరెడ్డి మాట్లాడుతూ... డోర్నకల్ నియోజకవర్గ ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేసి చివరి శ్వాస వరకు ప్రజల శ్రేయస్సును కోరిన దివంగత నూకల నరేష్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ ఈనెల 23వ తేదీన నూకల ఏరువాక వ్యవసాయ క్షేత్రంలో వరంగల్ మాజీ ఎంపీ రామ సహాయం సురేందర్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ ఉంటుందని అన్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నూకల నరేష్ రెడ్డి అభిమానులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.