17-09-2025 10:20:25 PM
మేడిపల్లి,(విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ మండల పూజ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి 41 రోజులు పూర్తయిన నేపథ్యంలో బుధవారం ఈ మండల పూజా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలవిరాట్ను పట్టు వస్త్రలతో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ వేడుకలు కు హాజరైన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.