calender_icon.png 18 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ జూనియర్ కళాశాల హాస్టల్ పై చర్యలు తీసుకోవాలి

17-09-2025 10:13:49 PM

కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అనుమతులు లేకుండా హాస్టల్ నడపడం విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడం లేదని దొగ్గలి శ్రీధర్ అన్నారు. రెండు రోజుల క్రితం కరీంనగర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా కోటా జూనియర్ కళాశాల ఎస్సార్ జూనియర్ కళాశాలలో వంట రూములలో శుభ్రత లేకపోవడం కాలం చెల్లిన వస్తువులు వాడడం లాంటివి అధికారులకు దొరికినాయి. ఇలా ఈ రెండు కళాశాల కాకుండా కరీంనగర్లో అన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలను తనిఖీలు చేయాలని వీటన్నింటికీ ప్రభుత్వం అనుమతి ఉందా లేదని అధికారులు తనిఖీచేయాలి.

జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వీటిని అన్నింటిని పట్టించుకోకుండా కళాశాలల ను తనిఖీ చేయడం లేదు జూనియర్ కళాశాలలు తమ ఇష్టానుసారంగా హాస్టల్లో ఏర్పాటు చేసుకొని విద్యార్థులకు ఇబ్బంది కలగజేస్తున్న పట్టించుకునే వారెవరు లేరు కరీంనగర్ లోని జూనియర్ కళాశాలలో చాలా మటుకు అనుమతులు లేకుండానే హాస్టల్ నడుపుతున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అన్ని కళాశాలలను తనిఖీ చేసి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేలా అలాగే అనుమతి లేని హాస్టల్లో మూసివేసి బాధ్యులైన యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.