17 July, 2026 | 5:00 PM

కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి: బండి

04-06-2024 03:36 AM

కరీంనగర్, జూన్ 3 (విజయక్రాంతి): కౌంటింగ్ పూర్తయ్యేవరకూ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం జరగనుండగా సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా కౌంటింగ్ ఏజెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలిచ్చారు. కౌంటింగ్ సమయంలో అనుమానం వస్తే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని  కోరారు.