04-02-2026 12:39:31 AM
చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేందర్
వెంకటాపూర్, ఫిబ్రవరి03,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్స్ డే సందర్భంగా ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ హాజరై మాట్లాడుతూ.. పొగాకు, గుట్కాలు, సిగరెట్లు, గంజాయి వంటి పదార్థాలు క్యాన్సర్ ను కలిగిస్తాయని, వీటికి దూరంగా ఉండటం ఎంతో ముఖ్యమని తెలిపారు.
అనంతరం డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ మాట్లాడుతూ.. క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించడం ద్వారా వ్యాధిని ఎదుర్కోవచ్చని, ఆరోగ్యవంతమైన ఆహారం, ప్రతి రోజు వ్యాయామం ద్వారా ఇలాంటి జబ్బులు తగ్గించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్లు డా.రిషిత, డా.మిత్ర, శోభ, విజయ తదితరులు పాల్గొన్నారు.