20-05-2025 01:25:53 AM
వనపర్తి టౌన్ మే 19: జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వ ద్ద ఎక్కువ సమయం నిలపకుండా వేగంగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఈ వెంకటేశ్వర్లు తో కలిసి రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులతో, ట్రా న్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లులు,గోడౌన్లకు తరలించేందుకు ట్రాన్స్పోర్టేషన్ స మస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ధాన్యాన్ని మిల్లుల వద్ద ఒక రోజుకు మించి ఎక్కువ నిలపవద్దని వేగంగా దించుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు.తేమ,తాలు పేరుతో తరుగు పేరు చెప్పి రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని మిల్లర్లకు సూచించారు.
రైతులకు వేగంగా నగదు జమ అయ్యేవిధంగా అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం కావాలన్నారు. మిల్లర్లు తమ సొంత వాహనాలు ఉంటే ధాన్యం ట్రాన్స్పోర్ట్ కు వినియోగించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల డి ఎం జగన్ మోహన్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, మార్కెటింగ్ అధికారి, రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.