calender_icon.png 20 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలో ఎమ్మెల్యే పద్మావతి సుడిగాలి పర్యటన

20-05-2025 01:25:24 AM

రూ.58 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 

కోదాడ, మే 19: కోదాడ మండలం, కూచిపూడి లో రూ 12 కోట్లతో 5.5 కిలోమీటర్ల మేర కూచిపుడి నుండి తొగర్రాయి వరకు నిర్మాణం చేయనున్న ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు కు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు.

తొగర్రాయి లో రూ 8కోట్లతో తొగర్రాయి నుండి శీత్లా తండా వరకు ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు కు శంకుస్థాపన చేశారు. చిలుకూరు మండలం, నారాయణపురం లో  రూ 20 కోట్లతో ఆర్ అండ్ బి డబుల్ రోడ్డు కు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు.

కోదాడ ఆర్టీసీ బస్ స్టేషన్ ను సందర్శించి రూ 16.85 కోట్లతో బస్టాండ్ ఆధునీకరణ కు మంజూరైన పనుల ప్రగతి పై సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలాజీనగర్ లో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్-స్టేషన్ ప్రారంభించారు.

మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, హైకోర్టు హైకోర్టు అడ్వకేట్ పల్లెనాగేశ్వరావు తూమాటి వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీపీ మల్లెల రాణి ,ఇర్లా సీతారాంరెడ్డి, అమరనాయని వెంకటేశ్వరరావు, కోదాడ పి ఎస్ ఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి,శేషు, సాదినేని లీల అప్పారావు, గంగవరపు లక్ష్మణరావు, సులోచనరావు, పాల్గొన్నారు.