13 May, 2026 | 5:37 AM

ఆయిల్ పామ్ సాగు పెంపునకు చర్యలు

05-02-2025 01:47 AM

* ప్రతి మండలంలో అవసరమైన మేర యూరియా స్టాక్ అందుబాటులో పెట్టుకొవాలి

* ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్, ఎరువుల లభ్యతపై రివ్యూలో కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, ఫిబ్రవరి -4: జిల్లాలో లాభసా టి పంట ఆయిల్ ఫామ్ సాగు పెంపుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్, ఎరువుల లభ్యత పై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్ట ర్  మాట్లాడుతూ ప్రస్తుత సంవత్స రంలో మన జిల్లాలో 750  ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగిందని, ఈ సంఖ్యను నిర్దేశిత లక్ష్యం మేరకు 1000 ఎకరాలకు తీసుకొని పోవాలని కలెక్టర్ అధి కారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు పురోగ తిపై వ్యవసాయ శాఖ, ఉద్యాన వన శాఖ అధికారులు రెగ్యులర్ మానిట రింగ్ చేయా లన్నారు. 

జిల్లాలో పెద్ద రైతులను ముందు గా లక్ష్యం చేసుకొని, ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఉపయోగాలు వివరి స్తూ, వారిలో ఉన్న భూమిలో కొంత మేర ఆయిల్ పామ్ కు డైవర్ట్ అయ్యేలా చూడాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కనబ ర్చే రైతుల నుంచి త్వరితగతిన మొక్కలకు, డ్రిఫ్ట్‌కు డీడీ లు కట్టించాలని అన్నారు. 

ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతుకు సబ్సిడీ అందేలా చూడాలని,  డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం వేగవం తంగా పూర్తి చేయాలని, జిల్లాలో రైతులకు అవసరమైన మేర ఎరువుల స్టాక్ అందుబా టులో ఉందన్నారు. ప్రతి మండలంలో అవసరమైన మేర యూరియా స్టాక్ అందు బాటులో పెట్టుకొవాలని, ఎక్కడ ఎటువంటి కొరత రావడానికి వీలు లేదన్నారు.

మండ లంలో ప్రైవేట్ వ్యాపారు ల వద్ద ఉన్న స్టాక్ తనిఖీ చేస్తూ ఎక్కడ కత్రిమ కొరత సష్టించ కుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎరువుల కొరత సంబంధించి ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిన వెంటనే స్పందిం చాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో  డి.హెచ్.ఎస్.ఓ జగ న్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆ దిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.