ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం
- జూన్ 2న అదిలాబాద్ జిల్లాలో రెండో దశ ఇళ్లను ప్రారంభిస్తాం
- రెవెన్యూ, హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పది
- పేదరికమే అర్హతగా లబ్ధిదారుల ఎంపిక
- స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి) : ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మొదటి విడత ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణం కొలిక్కి వచ్చిన నేపథ్యంలో జూన్ 2న అదిలాబాద్ జిల్లాలో రెం డో దశను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధా నాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.
మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మ డి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఇన్‌ఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హౌసింగ్, రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై సమీక్షించారు. సమీక్షలో స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుదీన్, మండలి చీఫ్ విప్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి దూరంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మిం చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. అటువంటి తప్పులు పునరావృతం కాకుండా పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు క్యూర్ పరిధిలోనే 5 నుంచి 8 కిలో మీటర్ల లోపు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు.
నియోజకవర్గం యూనిట్‌గా స్థలాలను గుర్తించి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను ఆదే శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూం ఇళ్లతో పాటు నిర్మాణ దశలో ఉన్నవాటికి పంపిణీ చేసేందుకు ఈనెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తించాలని ఆదేశించారు. హైదరాబాద్ పరిధిలో స్థలాలున్న పేదలకు ఈనెలా చివరిలోపు ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూములు అంగుళం అన్యాక్రాంతమైనా సహించం
ప్రభుత్వ భూములు అంగుళం అన్యాక్రాంతమైనా సహించమని మంత్రి పొంగు లేటి హెచ్చరించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో యుఎల్ సీ భూములు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా కొంత భాగం రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి మంత్రి దృష్టికి తీసుకురాగా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ పై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదే శించారు.
పేదలకు మేలు కలగాలి : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదలకు మే లు కలిగేలా చూడాలని, ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకంపై సమీక్ష చేయాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సూచించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం గొప్పగా అమలు జరుగుతుందన్నారు.
రాజకీయాలకు తావులేదు : మంత్రి శ్రీధర్‌బాబు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావులేదని ఐటీ, పరిశ్రమ లు శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ము ఖ్యమైనదన్నారు. ఈ పథకం పకడ్బందీగా అమలవుతున్నదని, ఇదే విధంగా ముం దుకు తీసుకెళ్లాలన్నారు.
పేదరికమే అర్హతగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని, ఇందు లో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, భేషజాలకు పోవడం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కలెక్టర్లు ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు.






