13 May, 2026 | 1:45 AM

హిందువుల ఐక్యత చాటుదాం

13-05-2026 12:58 AM
  1. టవర్ సర్కిల్‌పై కాషాయ జెండాను ఎగురవేశాం
  2. ఎన్ని బాధలు వచ్చినా నేను కంటతడి పెట్టను 
  3. కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  4. కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్ర 
  5. ప్రారంభించిన హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి 

కరీంనగర్, మే 12 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హిందూ ఏక్తా యా త్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి హాజ రై  వైశ్య భవన్ వద్ద ఏక్తా యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర వైశ్య భవన్, టవర్స ర్కిల్, వన్ టౌన్, బస్టాండ్, తెలంగాణ చౌక్, మంచిర్యాల చౌరస్తా, కార్యానగడ్డ మీదుగా తిరిగి వైశ్య భవన్ వద్దకు చేరుకుంది.

వేలాదిగా కాపాయ శ్రేణులు, హనుమాన్ భక్తు లు తరలివచ్చారు. కాషాయ జెండాలతో, హనుమాన్ నామ స్మరణలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని టవర్ సర్కిల్ పై కాషాయ జెండా ఎగురవేశామని, అందకు కరీంనగర్ ప్రజలకు హ్యా ట్సాఫ్ తెలుపుతున్నామన్నారు. హిందువుల ఐక్యతను చాటేందుకు 16 ఏళ్లుగా హిందూ ఏక్తా యాత్రను చేస్తున్నానని తెలిపారు.

జై శ్రీరాం అనే నినాదమే హిందూ ధర్మాన్ని కాపాడుకుందన్నారు. కరీంనగర్ గడ్డ రక్తం నాలో ప్రవహిస్తుందని కరీంనగర్‌లో గల్లీగల్లీలో ప్రజా సమస్యలపై కొట్లాడానని తెలి పారు. ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా కంటతడి పెట్టనని బండి సంజయ్ స్పష్టం చేశా రు. చిన్న కార్యకర్తగా తన ప్రస్థానం మొదలయిందన్నారు. హార్టులో స్టంట్ ఉన్నా హార్డుల్లో 1600 కిలోమీటర్లు నడిచానని, తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్నానని తెలిపారు.

నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పం పినా భయడపలేదని, ఏ హిందువుకు ఆపదొచ్చినా అండగా ఉన్నానని తెలిపారు. ‘మీ ఇంట్లో పెద్ద కొడుకునయ్యానని, నా టైమం తా సమాజానికే ఇచ్చానని, నా కొడుకుకు టైమియయలేకపోయా’ అని అన్నారు. ‘నా కొడుకును క్రిమినల్‌గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెపుతున్నాడు. అయినా నా కొడుకును నేను సమర్ధించడం లేదు.

చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తా, కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తా. చట్ట ప్రకారం చర్యలు తీసుకో వచ్చు’ అన్నారు. ‘నా భార్య సైతం నన్ను ఫా లో అవుతుంది. నేనున్నా లేకున్నా కార్యకర్తలకు చేతనైనంత సాయం చేస్తోంది. ఇవాళ నా కొడుకుపై జరుగుతున్న దాడిని చూసి కన్నపేగు తల్లడిల్లుతోంది.

నా కొడుకు సం ఘటన మమ్ముల్ని ఇబ్బంది పెడుతుంటే.. 29 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ గుర్తుకొస్తోంది’ అని బండి సంజయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజే పీ నాయకులు, కార్యకర్తలు, హనుమాన్ భ క్తులు, ప్రజలు పాల్గొన్నారు.