calender_icon.png 6 December, 2024 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మకు కడుపు కోత

05-11-2024 12:29:00 AM

  1. వికారాబాద్ జిల్లాలో విచ్చలవిడిగా సిజేరియన్లు
  2. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కాసుల కోసం కక్కుర్తి 

వికారాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): పంటి బిగువన నొప్పిని భరిస్తూ, ప్రసవ వేదనను అనుభవించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. కానీ, ప్రస్తుత సమాజంలో అవసరం ఉన్నా లేకున్నా కాన్పు కోతలు పెరుగుతున్నాయి.

సుఖ ప్రసవానికి వీలు లేనప్పుడు, కడుపులో బిడ్డ సరిగా లేనప్పుడే సిజేరియన్లు చేయాలి. కానీ కాసుల యావతో కోతల తోవలో వెళ్తున్నాయి పలు ఆసుపత్రులు. ప్రభుత్వ ఆసుపత్రులైనా, ప్రైవేటు ఆసుపత్రులైనా ఈ ఆపరేషన్లకు అడ్డాగా మారాయి.

అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండి సాధారణ కాన్పు కోసం వెళ్తే.. బిడ్డ అడ్డం తిరిగిందని, తల్లికి బీపీ సాధారణంగా లేదని, రక్తహీనత ఉందని ఏదో ఒకరకంగా భయపెట్టి అమ్మ కడుపును అడ్డదిడ్డంగా కోసి డబ్బులు దండుకుంటున్నారు. అలాగే కాన్పు సమయంలో మహిళల్లో భయాలు కూడా సిజేరియన్‌కు దారితీస్తున్నాయి. 

58 శాతం సిజేరియన్లు

వికారాబాద్ జిల్లాలో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ నమోదవుతున్న ప్రసవాల్లో ఏకంగా 58 శాతం సిజేరియన్లు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి వైద్యులు, ఆసుపత్రుల ధనదాహం ప్రధాన కారణంగా మారాయి. ఒక్కో సీజేరియన్ ఆపరేషన్ కోసం రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు తీసుకుంటున్నారు.

మందులకు అదనంగా రూ. 10 వేల నుంచి రూ.15 వేలు వ సూలు చేస్తున్నారు. ఇందులో కూడా ప్రై వేటు డాక్టర్లు కక్కుర్తి పడుతున్నారు. వాళ్లే సొంతంగా మెడికల్ షాపులను నడుపుతున్నారు. మందులు వాళ్ల షాపుల్లోనే క చ్చితంగా కొనాలి. బయటి నుంచి మందు లు తెస్తామంటే వైద్యులు ఒప్పుకోరు.

ప్రభుత్వాల నిర్లక్ష్యం

మహిళా ఆరోగ్యాన్ని దెబ్బతీసే సిజేరియన్ల నియంత్రణలో ప్రభుత్వాలు ఆ శించిన స్థాయిలో పనిచేయడం లేదన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. రాష్ట్రం లో ప్రైవేటు ఆసుపత్రుల్లో 75 శాతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 41 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. 

ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం, వాటిపై సర్కారు నియంత్రణ లేకపోవడం, వైద్యశాఖలో నిఘా, చర్యలు తీసుకునే యంత్రాంగం పెద్దగా లేకపోవడం వంటివి సిజేరియన్లు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నా యి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సి బ్బంది కొరత, సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రసవాల కోసం ప్రైవేటు వైపు మొగ్గు చూపుతున్నారు.

అయితే, ప్రభు త్వ ఆసుపత్రులకు వచ్చే గర్భిణులను కూడా సిజేరియన్ల కోసం కొందరు వై ద్యులు, సిబ్బంది ప్రైవేటుకు పంపుతున్నారని, తద్వారా కొంత కమీషన్ తీసు కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 

జిల్లాలో ప్రసవాల వివరాలు (జనవరి నుంచి సెప్టెంబర్ వరకు) 

ప్రభుత్వ : 

సాధారణ కాన్పు - 3,631

సిజేరియన్లు - 1,845

ప్రైవేటు :

సాధారణ కాన్పు - 436

సిజేరియన్లు -  2,713