17 April, 2026 | 11:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట

25-02-2026 12:00 AM

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

మహబూబాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రా వు అధికారులను ఆదేశించారు. మంగళవా రం ఐడిఓసి కార్యాలయంలో రెవెన్యూ, పో లీస్, మైనింగ్, టిజీఎండిసి, పంచాయతీ రా జ్ శాఖల అధికారులతో ఇసుక అక్రమ ర వాణా నియంత్రణ, ఇందిరమ్మ ఇండ్లకు ఇ సుక సరఫరా, కొడవటంచ దేవాలయ జా తర ఏర్పాట్లు, యూరియా కొరకు యాప్ ద్వారా బుకింగ్ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చే శారు. రెవెన్యూ, పోలీస్, టిజీఎండిసి శాఖల తో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి పటిష్ట పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఇసుక రవాణాను సీసీ కెమెరాల ద్వారా నిఘా పె ట్టాలని సూచించారు. అక్రమంగా ఇసుక తరలించినట్లయితే తక్షణమే కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేసి రిమాండ్ చే యాలని స్పష్టంచేశారు.

ఇసుక రవాణాకు నంబర్లు లేని వాహనాలకు అనుమతి లేదని, డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వేగ నియంత్రణ పాటించాలని, మైనర్లు వాహనాలు నడపకూడదని తె లిపారు. ఇసుక ప్రజల అవసరాలకే వినియోగించాలని,జిల్లా దాటి ఇసుక ఇతర ప్రాం తాలకు తరలించరాదని తెలిపారు. ట్రాక్టర్ల ద్వారా మాత్రమే రవాణా చేయాలని, ఇసుక తవ్వకాల్లో యంత్రాలు వాడకూడదని, మనుషులను వినియోగించాలన్నారు.అక్రమ నిల్వ లు గుర్తించిన వెంటనే సీజ్ చేసి కేసులు న మోదు చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను కూపన్ల విధానంలో సరఫరా చేయాలని ఎ మ్మెల్యే సూచించారు. తప్పుడు పత్రాలు స మర్పించినట్లయితే సంబంధిత వారిపై పో లీస్ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మండలాల వారీగా ఇందిరమ్మ ఇం డ్లకు అవసరమైన ఇసుకపై నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అ క్రమ రవాణాను అరికట్టేందుకు సమన్వయంతో పర్యవేక్షణ కొనసాగించాలని తెలి పారు. ఇసుక కొరకు గృహనిర్మాణ శాఖ ద్వారా  నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎ స్పీ సంకీర్త్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్ర జల అవసరాలకు ఇసుక అందేలా చూడాల ని, బయటకు తరలింపును పూర్తిగా అరికట్టాలని అన్నారు. పూర్తి అయిన ఇందిరమ్మ ఇం డ్ల జాబితాను సిద్ధం చేసి అదనపు ఇసుక సరఫరాను నియంత్రించాలని సూచించారు. అ క్రమంగా తరలిస్తే తక్షణమే కేసు నమోదు చే సి ట్రాక్టర్ సీజ్ చేసి రిమాండ్ చేయాలని ఆ దేశించారు.

25 నుండి ప్రారంభం కానున్నకొడవటంచ దేవాలయ జాతరకు భక్తులు అ ధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య చర్యలు, తాగునీరు, ఆరుగుదొడ్లు, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎ మ్మెల్యే సూచించారు. యూరియా గురించి మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాల ని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్, మైనింగ్ ఏడి జయరాజ్, టీ జీఎండిసి పిఓ రామకృష్ణ,తహసిల్దారులు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.