17 April, 2026 | 4:07 AM

ప్లాస్టిక్ బ్యాగుల తయారీ ఆపాలి

07-06-2025 12:00 AM

పర్యావరణ పరిరక్షణ కోసం ‘ప్లాస్టిక్ బ్యాగులు వద్దు బట్ట బ్యాగులు ముద్దు’ అంటే బాగుంటుంది. కానీ, ఏ రాజకీయ నాయకులూ ప్లాస్టిక్ బ్యాగులను అరి కడదామని, అందుకు చట్టం తీసుకురావాలని’ నిష్ఠగా మెలగడం లేదు. ‘ప్లాస్టిక్ బ్యాగులు అమ్మే దుకాణాలపైన మాత్రం వారి జులుం చూపిస్తున్నారు. వాటిని తయారుచేసే ఫ్యాక్టరీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 

 సింగు లక్ష్మీనారాయణ, చింతకుంట