calender_icon.png 31 July, 2025 | 3:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి మనుషుల వెతలే సీతారాం కథలు

18-07-2025 12:00:00 AM

నాటి ప్రసిద్ధ కవులు, రచయితలు, భాషావేత్తలు, పండితులైన దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, పల్లా దుర్గ య్య, వట్టికోట అల్వారుస్వామి, బిరుదరాజు రామరాజు, డీ రామలింగం, నెల్లూరు కేశవ స్వామి, సురమౌళి మొదలైన వారితో సీతారాంకు మంచి సాంగత్యం ఉండేది. హైదరాబాద్‌లోని నారాయణగూడ వీరందరి అడ్డా. అక్కడో వీధి చివర వీరి సాహితీ చర్చలు సాగుతుండేవి. మిగతా వారంతా కవిత్వం రాస్తుంటే దాశరథి రంగాచార్య, నెల్లూరి కేశవస్వామి డీ రామలింగం, సురమౌళి, గూడూరి సీతారాం కథలు మాత్రమే రాస్తుండేవారు. వీరి కథలు ఎక్కువగా నాటి పత్రికల్లో అచ్చవుతూ ఉండేవి. 

ప్రజాకవి కాళోజీ నారాయణరా వు ‘నా గొడవ’ రచన మొదటి ముద్రణకు ప్రూఫ్ రీడింగ్ చూసిన అక్షరా ల కొలిమి అతడు. కవి సీ నారాయణరెడ్డి (సినారె) పీహెచ్‌డీ గ్రంథమైన ‘ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయాలు, ప్రయో గాలు’ శుద్ధ ప్రతిని తయారు చేసిన సాహి తీ శ్రామికుడు అతడు. నెల్లూరు కేశవస్వా మి ఉత్తమ కథలు పుస్తకానికి, సంపాదకత్వం వహించి, ముందుమాట లిఖించిన కథా ప్రేమికుడతడు.

తెలంగాణ తొలితరం సాహిత్య మాగాణంలో విరబూసిన కథా పుష్పగుచ్ఛమతడు. మట్టి మనుషుల కన్నీ ళ్లు, కష్టాలు, బాధలు, గాధలు, జీవితాల తో పాటు తెలంగాణ సంస్కతిని కథలు గా అక్షరబద్ధం చేసిన నిఖార్సున కథకుడు గూడూరి సీతారాం. వారి స్వగ్రామం ఉ మ్మడి కరీంనగర్ జిల్లా హనుమాజీపేట. సీతారాం 1936 జూలై 18న వెంకటలక్ష్మి, లక్ష్మయ్య దంపతులకు జన్మించాడు.

యా దృచ్చికమే అయినా డాక్టర్ సీ నారాయణరెడ్డి (సినారె) జన్మస్థలం కూడా అదే కావ డం విశేషం. సీతారాం సిరిసిల్లలో ప్రాథమిక పాఠశాల విద్యాభ్యాసం పూరి ్తచేశారు. కళాశాల విద్య కోసం హైదరాబాద్‌కు వ చ్చి నిజాం కాలేజీలో చేరాడు. ఆయనకు చిన్నప్పటి నుంచే సాహిత్యాభిలాష ఉండే ది. ఆ అభిరుచితోనే తొలిసారి ‘స్త్రీ స్వాతం త్య్రం’ అనే కథ రాశారు. ఆ కథ ‘నినాదం’ అనే పత్రికలో ప్రచురితమైంది.

‘స్త్రీకి స్వా తంత్య్రం కావాలని వేదికలపై ఉపన్యాసా లు దంచే వాళ్లందరూ, వాళ్ల ఇంట్లో భార్య ను కనీసం ప్రశ్నించనివ్వరు. కూతురి ప్రే మ వివాహాన్ని అంగీకరించరు. తమ ఇం ట్లో వితంతువుకు వివాహం జరగనివ్వరు’ అనే ఇతివృత్తంతో ఉంటుందా కథ. 1956  సీతారాం ‘తరంగిణి’ అనే పత్రికను ప్రారంభించారు.

పత్రిక నడుపుతూనే సమాంత రంగా తెలుగు స్వతంత్ర, తెలుగు దేశం, సుజాత, ఆంధ్రప్రభ వారపత్రిక, ఎన్నో పత్రికలకు అనేక కథలు రాశారు. దురదృష్టవశాత్తు వాటిలో చాలా కథలు ఇప్పుడు అలభ్యం. సీతారాం కథలు రాస్తాడే కానీ, వాటిని భద్రపరుచుకునే అలవాటు ఆయనకు పెద్దగా లేదు.

సాహితీవేత్తలు, పండితులతో సాంగత్యం..

నాటి ప్రసిద్ధ కవులు, రచయితలు, భాషావేత్తలు, పండితులైన దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, పల్లా దుర్గ య్య, వట్టికోట అల్వారుస్వామి, బిరుదరాజు రామరాజు, డీ రామలింగం, నెల్లూ రు కేశవ స్వామి, సురమౌళి మొదలైన వారితో సీతారాంకు మంచి సాంగత్యం ఉండేది. హైదరాబాద్‌లోని నారాయణగూడ వీరందరి అడ్డా. అక్కడో వీధి చివర వీరి సాహితీ చర్చలు సాగుతుండేవి.

మిగతా వారంతా కవిత్వం రాస్తుంటే దాశరథి రంగాచార్య, నెల్లూరి కేశవస్వామి డీ రామ లింగం, సురమౌళి, గూడూరి సీతారాం కథలు మాత్రమే రాస్తుండేవారు. వీరి కథ లు ఎక్కువగా పల్లెటూరు, ప్రజామత వార పత్రిక, స్రవంతి మాసపత్రికలో అచ్చవు తూ ఉండేవి. ‘అప్పటి మా కథల అచ్చు ప్రతులను కాపాడుకోలేకపోయాం. మాకు వాటిపై కనీసమైన ధ్యాస ఉండేది కాదు’ అని ఎన్నోసార్లు వారు వాపోయిన సందర్భాలు ఉన్నాయి.

1902 నుంచి తెలంగాణ కథ సామాజిక పరిణామాలను చిత్రిస్తూ వస్తున్నది. బండారు అచ్చమాంబ తొలి కథకురాలని చరిత్ర చెబుతోంది. అప్పటి తెలంగాణ కథ పుట్టుక నుంచి సామాజిక చైతన్యంతోనే కొనసాగుతూ వచ్చింది. సీతారాం కథల్లో సామాజిక పరిశీలన, విశ్లేషణ పరిణామాలు, ఫ్యూడల్ సమాజం, ప్రజాస్వామిక స్వేచ్ఛ, తెలంగాణ పలుకుబడులు, గ్రామీణ ప్రాంతం లో కుల వృత్తులు, సంస్కృతి, గ్రామీణ జీవితం, ప్రజాస్వామిక ఉద్యమాలు మొదలైన అన్ని పరిణామాలు కనిపించేవి. 

కథలూ కమామీషు..

‘రాజమ్మ రాజీర్కం’ అనే కథలో అం దంగా ముస్తాబు కావాలనే పల్లె పడుచుల కోరికలను అదనుగా చేసుకుని వ్యాపారులు  స్త్రీలను ఎలా లోబరచుకున్నారన్నది సీతారాం కటువైన వాస్తవంగా కథలో వివరించారు. ‘లచ్చి’ అనే కథలో భిక్షాటన చేసే వారి బతుకుల్లో ఉండే కష్టాలు, కుటుంబ పరిస్థితులు, రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయి.. పట్నం నుంచి మళ్లీ పల్లెకు వచ్చిన మహిళ ఎలా జీవిస్తుందో కళ్లకు కట్టినట్లు రాశారు.

పేదరికంతో తండ్రి చనిపోతే కుటుంబ పోషణ కోసం బొంబాయి వెళ్లి దొంగల చేత మోసపోయి ఇంటికి చేరిన యువకుడి కథ ‘మా రాజు’. గ్రామీణులు పట్నానికి, అలవాటుపడలేక రైలు ఎక్కడానికి కూడా నానా అవస్థలు పడే కథ ‘పిచ్చోడు’. చిన్నప్పుడే బతుకుతెరువు కోసం వలస వెళ్లిన రంగడు ఊరు గుర్తుకొచ్చి మారిన పల్లెను చూసి ఆశ్చర్యపోతా డు. తనని రక్షించిన దొరసాని చనిపోయిందని తట్టుకోలేక దుఃఖంతో గ్రామం నుంచి వెళ్తాడు.

అదే ‘రంగడి కథ’. ‘దెబ్బతిన్న అ హంభావం’లో పురుషుడు అహంకారం తో భార్యను అనుమానిస్తే, ఆమె పుట్టింటికివెళ్లి కొంతకాలం తర్వాత తిరిగి వస్తే.. భర్త వేరే స్త్రీతో అక్రమ సంబంధం నెరపుతుంటాడు. ఛీ అని భార్య వెళ్లిపోతుంది. ఏకాం తం అనుభవిస్తున్నానని భ్రమలో ఉన్న భర్త చివరకు ఏమైపోతాడని చెప్పేదే ‘ఏకాంతం’ అనే కథ. పైకి విద్యార్థి నాయకుడి గా ఉపన్యాసాలు దంచుతూ, నీతి వాక్యా లు వల్లిస్తూ..

ఒక యువతికి మాయ మాటలు చెప్పి, ఆమెకు ఎలా గర్భం తెచ్చి, తర్వా త ఎలా మోసం చేశాడని చెప్పేదే ‘మేడిపం డు’ కథ. ప్రేమించి పెళ్లి చేసుకొని ఎవరికీ చెప్పకుండా ఊరెళ్లి పోయిన యువకుడి క థ ‘బస్సు కదిలింది’. ఇద్దరు ప్రేమికులు వి డిపోయి, వేరే పెళ్లిళ్లు చేసుకుంటారు. పెళ్లి తర్వాత ఆ మహిళ భర్తకు పాత ప్రేమ గు రించి తెలుస్తుంది. భర్త ఆమెను రాచిరం పాన పెడతాడు.

పురుషాధిపత్యం ఎంత దారుణంగా ఉంటుందో ఈ ‘చీకటి గొడుగులు’ అనే కథలో సీతారాం చెప్పా రు. క థలను తన దైన శైలిలో ప్రథమ పురు ష, ఉత్తమ పురుషతో పాటుగా ఫ్లాష్‌బ్యాక్‌తో చెప్పడం సీతారాంకు అబ్బిన విద్య. అద్భుతమైన కథా శిల్పంతో, సహజత్వంతో ఆ యన కథలు మట్టి కథలుగా ఆకట్టుకుంటా యి. ఆయన రాసిన కథలు తెలంగాణ మ నిషికి తెలిసిన పదబంధాలు, పలుకుబడులు, జాతీయాలు చల్ల నుంచి వెన్న తీసి నంత నేర్పుగా మనకు తారసపడతాయి. 

సంపాదకత్వంలో సంకలనాలు..

గూడూరి సీతారాం సంపాదకత్వం వహించిన ‘నెల్లూరు కేశవ స్వామి ఉత్తమ కథల’ పుస్తకంపై పదోతరగతి విద్యార్థుల తెలుగు పుస్తకంలో ‘భూమిక’ అనే పేరుతో ప్రభుత్వం పాఠ్యాంశం చేర్చడం ముదావ హం. అరుదైన కథకుడిని తెలంగాణ సా హితీ లోకానికి పరిచయం చేయడం నిజం గా ఆనందదాయకమైన విషయం.

విశిష్టమైన వస్తువు, శిల్ప నైపుణ్యంతో, సాహితీ కం మరువలేని కథలను అందించి తెలంగాణ కథా ప్రపంచంలో, మాసిపోని కథా రచయితగా, చిరస్మరణీయుడిగా వెలుగొంది మనకాలపు మట్టి కథల మాంత్రికు డుగా కీర్తించబడిన సీతారం 25 సెప్టెంబర్  2011న కన్నుమూశారు. 

 జడామెంతబోయిన సైదులు వ్యాసకర్త సెల్ 90109 10956