17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

నిర్మల్‌లో గాలివాన బీభత్సం

11-06-2025 12:00 AM
  1. నేలకూలిన వందల ఏళ్ల నాటి వేపచెట్టు 
  2. పలు కాలనీల్లో గాలికి ఎగిరిపోయిన రేకుల షెడ్లు 

నిర్మల్, జూన్ 10 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో సోమవారం రాత్రి గాలివాన బీభత్సం జనాన్ని అతలాకుతలం చేసింది. రాత్రి పది గంటల నుంచి 11 గంటల వరకు బలమైన గాలులతో పాటు వర్షం భారీగా కురవడంతో నిర్మల్ పట్టణం మొత్తం జలమయమైంది. బలమైన గాలుల వల్ల పాత తహసీల్దార్ కార్యాలయం వద్ద వందల ఏళ్లనాటి వేప చెట్టు కూలిపోయింది.

బ్రహ్మపురిలో 120 ఏళ్ల రాగి చెట్టు కొమ్మలు విరిగిపడటంతో ప్రజలు భయభ్రాంతులకు గురై, ఇళ్లనుంచి పరుగులు తీశారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా బలమైన గాలులు వీయడంతో రోడ్లపై చెట్లు విరిగిపడి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. శాంతినగర్ ఆదర్శనగర్ గాజులపేట్ తతర కాలనీలో రేకుల షెడ్లు లేచిపోయాయి. ఓ వృక్షం ఆటోపై పడటంతో ఆటోనుజుగా అందులో ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి.

ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ దేవిదాస్ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మున్సిపల్ సిబ్బంది విరిగిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారు. సహాయక చర్యలు నిర్మల్ జిల్లాకు చెందిన శివంగి మహిళా టీం సభ్యులు విరిగిన చెట్ల కొమ్మలను తొలగించారు.