10-06-2025 11:25:18 PM
మాజీ ఎంపీపీ ఆశ శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి మాతృనాయక్..
మోతే: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడతామని జిల్లా నాయకులు నూకల మధుసూదన్ రెడ్డి ముప్పాని ఆశ శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పిటిసి బానోతు మాతృనాయక్ సామ చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కూడలి గ్రామంలో కూడలి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూక్య వీరు నాయక్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ(Congress Party) కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు అండగా నిలబడడంతో పాటు సహాయ సహకారాలు అందిస్తామని వారు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూడలి మాజీ సర్పంచ్ ఈసారం ఇందిరా శ్రీనివాస్, పొడపంగి ఎలమంచి, పొనుగోటి ప్రభాకర్ రావు, బొడ్డు సాలయ్య గౌడ్, రామాచారి, జలగం శ్రీనివాస్, ధరావత్ నాగులు, ధరావత్ వీర, వార్డ్ మెంబర్లు రాంబాబు, కుషన పెళ్లి ఉపేందర్, బొడ్డు గురుకృష్ణ, బానోతు రూప్ల, ధరావత్ కిషన్, తదితరులు పాల్గొన్నారు.