13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

చిన్నారులపై వీధి కుక్కల దాడి..

23-03-2026 12:49 AM

హైదరాబాద్ నిలోఫర్‌కు తరలింపు

దోమకొండ, మార్చి 22, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని చింతమాన్ పల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారులపై వీధి కుక్కలు దాడి చేశాయి.  గ్రామంలో ఇద్దరు చిన్నారులు ఆదివారం బయట ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వెళ్తున్న కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన ఐదేళ్ల చిన్నారి హర్షిని, 16 నెలల చిన్నారి జాహ్నవిలను జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. చిన్నారుల పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో ఇద్దరిని హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు.