10 April, 2026 | 3:03 AM

ఆస్ట్రేలియా యూనివర్సిటీలతో భాగస్వామ్యం బలోపేతం

10-04-2026 01:00 AM

ఓయూ కీలక నిర్ణయం

సికింద్రాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యా, పరిశోధన రంగాల్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు ఆస్ట్రేలియా సంస్థలతో భాగస్వామ్యాలను విస్తరించే దిశ గా కీలక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఓయూ అంతర్జాతీయ వ్యవహారాల కార్యాలయ డైరెక్టర్ ప్రొఫెసర్ బి. విజయ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ప్రతినిధులు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ టాన్యా కోషీ, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ పీయూష్ అవస్థి హాజరయ్యారు.

ఈ భాగస్వామ్యంతో పరిశోధన సహకారం, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్, విద్యార్థుల మార్పిడి, గెస్ట్ లెక్చర్లు, ట్విన్నింగ్ ప్రోగ్రామ్లు వంటి పలు అంశాలను ఒకే అంతర్జాతీయ రోడ్మ్యాప్లో సమన్వయం చేయనున్నారు. ఇప్పటికే కొనసాగుతున్న ఫ్యాకల్టీ ఫెలోషిప్లు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లకు తోడు, ఒకటి నుంచి రెండు నెలల అకడమిక్ రెసిడెన్సీలు, షార్ట్ రీసెర్చ్ ప్రోగ్రాంలు, ఆన్లైన్ లెక్చర్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా రు. ఈ సమావేశంలో జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ ఎం.ఎ. హమీద్, డాక్టర్ అమంచి నాగేశ్వర్, ప్రొఫెసర్ పరిమళ, ప్రొఫెసర్ అను పమ తదితరులు పాల్గొన్నారు.