26 March, 2026 | 2:51 AM

డీఎస్‌హెచ్‌తో ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతం

26-03-2026 12:57 AM
  1. ఉద్యోగులకూ మేలు, ప్రజలకు నాణ్యమైన వైద్యం
  2. అదనపు ఖర్చు లేకుండా ప్రయోజనం
  3. టీవీవీపీ ఆస్తులన్నీ డీఎస్‌హెచ్ పరిధిలోనే
  4. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
  5. అసెంబ్లీలో వైద్య విధాన పరిషత్ రిపీల్ బిల్లుపై చర్చ

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాం తి): తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (డీఎస్‌హెచ్)గా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం పాలనా పరమైన మార్పు కాదని, ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్కరణ అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టంచేశారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులకు మేలు చేకూరడంతోపాటు ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యసేవలు అందుతాయని తెలిపారు.

అదనపు ఖర్చు లేకుండా అధిక ప్రయోజనం అందించే నిర్ణయంగా అభివర్ణించారు. రాష్ట్ర నలుమూలల ప్రజల కు అందుబాటులోనే మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. బుధవారం శాసనసభలో తెలంగాణ వైద్య విధా న పరిషత్ రిపీల్ బిల్లును మంత్రి రాజనర్సింహ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

టీవీవీపీలో ప్రస్తుతం 184 దవాఖానలు ఉన్నాయని, వీటిలో 12,720 పడకలు ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా ఏడాదికి సగటున సుమారు 1.2 కోట్ల మం దికి అవుట్ పేషెంట్ సేవలు, 12 లక్షల మం దికి ఇన్‌పేషెంట్ సేవలు, 50 వేల మందికి వివిధ శస్త్రచికిత్సలు, లక్షకుపైగా ప్రసవాలు చేస్తున్నట్టు వివరించారు. టీవీవీవీ గ్రాంట్ -ఇన్-ఎయిడ్ సంస్థగా పనిచేయడం వల్ల పరి పాలనా పరిమితులు, ఉద్యోగుల వేతనాల చెల్లింపులో జాప్యం, రోగులకు సేవలు అందించడంలో కొన్ని లోపాలు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్‌ను నెరవేర్చేందుకు టీవీవీపీని డీఎస్‌హెచ్‌గా మార్చుతున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా ఉద్యోగులకు పలు కీలక ప్రయోజనాలు లభించనున్నాయన్నారు. ట్రెజరీ ద్వారా సమయానికి జీతాల చెల్లిం పు, ఎంప్లాయీ హెల్త్ స్కీ మ్ కింద క్యాష్లెస్ వైద్యం, రూ.1.2 కోట్ల ప్రమాద బీమా, పూర్తి ప్రభుత్వ ఉద్యోగ హోదా లభిస్తుందని వివరించారు.

నిపుణులైన వైద్యుల నియామకం, రోగ నిర్ధారణ సేవల విస్తరణ, బలమైన రిఫరల్ వ్యవస్థ ద్వారా జిల్లాస్థాయిలోనే 80 శాతం వైద్య సేవలు అందించేలా సెకండరీ స్థాయి దవాఖానలు బలోపేతం అవుతాయన్నారు. దీంతో హైదరాబా ద్‌కు వావాల్సిన అవసరం తగ్గి, ప్రజల ఖర్చులు కూడా తగ్గుతాయని వివరించారు. 

టీవీవీపీ ఆస్తులన్నీ డీఎస్‌హెచ్‌కే ఉంటాయి

ప్రస్తుతం టీవీవీపీ పరిధిలో ఉన్న ఏరి యా, జిల్లా దవాఖానల్లోని 16 స్పెషాలిటీ విభాగాల్లో, 8 కీలక విభాగాలను బలోపేతం చేయనున్నట్టు మంత్రి తెలిపారు. గైనకాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పిల్లల వైద్యం, ఆర్థోపెడిక్స్, పాలీ ట్రామా, కంటి వైద్యం, ఊపిరితిత్తుల విభాగాల్లో సేవలను విస్తరించి, పేషెంట్లకు మరింత మెరుగైన వైద్య సేవకు అందిస్తామన్నారు.

జిల్లాలకే ఆధునిక వైద్య సదుపాయాలను తీసుకురావడంలో భాగంగా ప్రస్తుతం 6 దవాఖానల్లో ఉన్న సీటీ స్కాన్ సేవలను విస్తరించనున్నామని, అదనంగా 200 పడకలకుపైగా ఉన్న 11 దవాఖానల్లో కొత్తగా సీటీ స్కాన్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని, దీంతో గ్రామీణ ప్రజలకు సమీపంలోనే ఆధునిక నిర్ధారణ సేవలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. వైద్యరంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం భారీస్థాయిలో నియామకాలు చేపడుతోందని, ఈ రెండేళ్లలో టీవీవీపీలో 757 నర్సింగ్ ఆఫీసర్లు, 180 ల్యాబ్ టెక్నీషియన్లు, 48 ఫిజియోథెరపిస్ట్ పోస్టులు భర్తీ చేశామన్నారు.

ప్రస్తుతం మరో 2,075 పో స్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇం దులో 1,616 స్పెషలిస్ట్ డాక్ట ర్లు, 332 న ర్సులు, 42 డెంటల్ సర్జన్లు, 85 ఫార్మసిస్టు లు ఉన్నాయన్నారు. ఆరోగ్యశాఖలో డిసెంబర్ 2023 నుంచి 9,572 పో స్టులు భర్తీ కాగా, మరో 7,267 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయని, 2027లో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామన్నారు. మొత్తం 19,768 పోస్టుల భర్తీతో ఆరోగ్య వ్యవస్థ మరింత బలపడనుందన్నారు. ఐదు జిల్లా ఆస్పత్రుల్లో పీజీ మెడికల్ కాలేజీలను ఏ ర్పాటు చేస్తున్నామని  తెలిపారు.