ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది
సర్పంచ్ సుష్మ భూమేష్
జన్నారం, జూన్ 3: చిన్నారుల, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలే సరైన పునాదని పొన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అన్నారు. బుధ వారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొన్కల్ గ్రామంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి నిర్వహించిన ‘బడిబాట' కార్యక్రమంలో ఎంఈఓ విజయ్‌కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు ఎంతో దోహదపడతాయన్నారు. అనంతరం గ్రామంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, ఈఓ రాహుల్, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






