3 June, 2026 | 2:52 PM

గోదావరి పుష్కరాలు అంత్యంత వైభవంగా నిర్వహిస్తాం

03-06-2026 02:01 PM

ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు కేటాయించాం 

సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

ధర్మపురి,మే3(విజయక్రాంతి): 2027లో రానున్న గోదావరి పుష్కరాలను)(Godavari Pushkaralu) అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman) అన్నారు. ఇప్పటికే గోదావరి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు తొలి విడత విడుదల చేసిందనీ ఆయన తెలిపారు. బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.

వెల్గటూర్ నుండి రాజక్క పల్లె వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. అదే విధంగా వెల్గటూర్ లో నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద పర్యాటకులను ఆకర్షించే విధంగా బోటింగ్ సౌకర్యం కల్పించాలని మంత్రి సూచించారు. కోటిలింగాల నుండి పాసిగాం వరకు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు.

గత ప్రభుత్వ కాలంలో ఆగమేఘాల మీద పనులు ప్రారంభించి నాణ్యతకు త్రిలోధకాలు ఇచ్చారని మంత్రి అన్నారు. పుష్కరాల సమయంలో పనులు నడవడంతో పుష్కరాలకు వచ్చిన భక్తుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఏడాది ముందే పనులు ప్రారంభించి 2027 మార్చి వరకు పుష్కరాల పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో వెల్గటూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, వెలగటూర్ మాజీ సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గండ్ర శ్రీకాంత్ రావు ఆలయ కమిటీ చైర్మన్ మేరు నరేష్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్ముల వెంకటేష్, ఎనగందుల నరేష్, గండ్ర ప్రతాప్ రావు, నక్క సురేష్, గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.