08-12-2025 10:42:26 PM
ఇల్లెందు (విజయక్రాంతి): 2016వ సంవత్సరంలో సిలువేరు సదానందం, సిలువేరు రమేష్, మచ్చ వెంకన్న అను ఇరువురు సింగరేణి కాలరీస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించి అమాయకుల వద్ద నుండి డబ్బులు వసూలు చేశారు. వారికి ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో అడిగిన వారిని చంపుతామని బెదిరించిన కేసులో వాదోపవాదములు విన్న ఇల్లందు ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి నేరం రుజువైనందున సోమవారం ఇరువురికి మూడు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, రూ. పదివేల జరిమానా విధించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున నర్సింగ్ అనిల్ కుమార్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించగా పీసీ పోషాలు, హోంగార్డులు అనంతరాములు, అశోక్ లు సహకరించారు.