రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు
నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్
నల్లగొండ, మే 21 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందిను కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. పి.ఏ పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంను ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలపై ఆరా తీశారు.
అలాగే చిలకమర్రి ధాన్యం గోడౌన్లో నిల్వలు, తూకం విధానం, రవాణా ఏర్పాట్ల పరిశీలించారు. కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు వేగవంతమైన చెల్లింపులు జరిగిన చూడాలని అధికారులను ఆదేశించారు.
మధ్యవర్తులను నమ్మొద్దనీ నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులను కోరారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ, కూర్చునే సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈయన వెంట పీఏ పల్లి తహసిల్దార్ వజ్రాల జయశ్రీ, హలో అధికారులు ఉన్నారు.






