22 May, 2026 | 2:04 AM

ఉపాధి హామీ కూలీలు ఎండకు జాగ్రత్తలు తీసుకోవాలి

22-05-2026 12:00 AM

సర్పంచ్ కృష్ణనాయక్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే 21: వేసవిలో ఉపాధి హామీ కూలీలు ఎండకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ లూనావత్ కృష్ణనాయక్ సూచించారు.గురువారం మండలంలోని సూర్యానాయక్ తండా గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు.పనులు చేస్తున్న కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కార్మికులు వడదెబ్బ బారిన పడకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశంలో టెంట్లు,చల్లటి త్రాగునీటి కాన్లు,ఫస్ట్ ఎయిడ్ బాక్స్,ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల వంటి కనీస వసతులు ఏర్పాటు చేశారు.

ఎండ తీవ్రతకు కూలీలు తరచూ నీరుత్రాగడం,అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు.కూలీలు అస్వస్థతకు గురైతే వెంటనే గ్రామ సిబ్బందికి గాని సంబంధిత అధికారులకు గాని సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఏ పర్శరాములు,వార్డుసభ్యులు,గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.