దేశ సమగ్రత కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని మహా నాయకుడు రాజీవ్
హుజూర్ నగర్, మే 21: దేశ సమగ్రత కోసం ప్రాణాలు లెక్క చేయని మహా నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి,మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ రావు అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రత కోసం ప్రాణాలుఇచ్చిన కుటుంబంలో పుట్టి దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన మహానేత రాజీవ్ గాంధీ అన్నారు.రాజీవ్ గాంధీ ప్రధానిగా పనిచేసిన కాలంలో తీసుకువచ్చిన చారిత్రాత్మకమైన,విప్లవాత్మకమైన విధానాలు అమలు చేయడం వలన అనేక సాంకేతిక అభివృద్ధి పనులకు బీజం పడిందన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కలలను సాకారం చేయడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని తెలిపారు.ప్రగతిశీల భారత్ నిర్మాణంలో రాజీవ్ గాంధీ ఆశయాలు త్యాగం యువతకు ప్రేరణల నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






