4 July, 2026 | 9:15 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

భద్రాద్రిలో అన్యమత కవర్ల ద్వారా ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలి

03-06-2025 10:20 PM

దేవస్థానం ఈవోని కోరిన బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి..

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం దేవాలయంలో భక్తులు మనోభావాలు దెబ్బతినేలా కవర్ల ద్వారా అన్య మత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి(Bharatiya Janata Party President Byreddy Prabhakar Reddy) కోరారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి రామాలయంను సందర్శించి మొన్న ఆదివారం జరిగిన సంఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... స్వామి వారి శేష వస్త్రాలు అమ్మే కౌంటర్ లో అన్యమత ప్రచారం సంబందించిన ప్రచార కవర్ లో పెట్టి శేష వస్త్రాలు అమ్మిన సంఘటనలో దేవాలయం ఈవో రమాదేవిని వివరణ అడిగారు. దీనికి బాద్యులు ఆయన వారి మీద చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కుంజాధర్మ, జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్, జిల్లా కౌన్సిల్ నెంబర్ నిడదవోలు నాగబాబు. సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు, ములిశెట్టి రామ్మోహన్రావు బోడ సత్యనారాయణ, ముక్కెర కోటేశ్వరి, మండల ప్రధాన కార్యదర్శులు చెలుబోయిన వెంకన్న, పేరం ఉపేందర్, యువమోర్చా నాయకులు ములిశెట్టి నిఖిల్, అల్లాడి వెంకటసుబ్బయ్య, గార్లపాటి శీను, డి ఎస్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.