25 March, 2026 | 11:44 PM

బ్లాక్‌లో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ అమ్మితే కఠిన చర్యలే

25-03-2026 10:08 PM

సీఐ వెంకట్ రెడ్డి

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్/కంగ్టి/కల్హేర్ మండల పరిధిలోని ప్రజలకు సీఐ వెంకట్ రెడ్డి పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ... ఎక్కడ పెట్రోల్, డీజిల్ కొరత లేదు, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్యపు ప్రచారం నమ్మి నిల్వ చేసుకోవద్దన్నారు. పెట్రోల్ బంక్ యజమానులకు ముందస్తు హెచ్చరిక వాహనాలలో మాత్రమే పెట్రోల్, డిజిల్ పోయ్యలని, విడిగా డబ్బాలలో, బాటిల్లలో పోయ్యరాదని అన్నారు.

ఎవరైనా అలా కాదని పోస్తే పోలీస్ వారికీ తెలియ పరచాలని అన్నారు. వారి పై చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ కొరత కూడా లేదు వినియోగ దారులు ఆన్లైన్ ద్వారా మాత్రమే బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే డెలివరీ చేయడం జరుగుతుందని, ఎక్కడైనా గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ లో విక్రహిస్తే సమీప పోలీసు వారికి తెలియ పరుచాలని సీఐ వెంకట్ రెడ్డి అన్నారు.