calender_icon.png 5 August, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలి

30-11-2024 07:52:02 PM

నిర్మల్ జిల్లా విదుల్లో చేరిన 130 పోలీసులు

నిర్మల్ (విజయక్రాంతి): పోలీసు ఉగ్యోగం ఎంతో అంకిత భావంతో కూడుకున్నదని దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తే ప్రతి పోలీసు ఉద్యోగికి సమాజంలో మంచి పేరు వస్తుందని జిల్లా ఎస్పీ జానఖీ షర్మిల అన్నారు. శనివారం శిక్షణ పూర్తి చేసుకొని నిర్మల్ జిల్లా 137 మంది పోలీసులు విదుల్లో చేరారు. ముందుగ వారు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, అదనపు ఎస్పీ సూర్యనారాయణతో  కార్యాలయంలో మీట్ కార్యాక్రమంను శనివారం నిర్వహించారు. 67 మంది సివిల్, 36 మహిళ, 36 సాయుధ పోలీసులు, 6 మంది మహిళ సాయుధ పోలీసులు విధుల్లో చేరినట్టు అధికారులు తెలిపారు.

వారితో ఎస్సీ ఉద్యోగ నిబంధనలు విధుల నిర్వహాణ, సమయ పాలన, శాంతి భద్రతల విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు వివరించారు. సమాజంలో నేరాల కట్టడికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ప్రజలతో మంచి సంబదాలు పెట్టుకోని ప్రజలకు ఏ కష్టం వచ్చిన తామున్నమంటు భరోసా కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసుల అధికారులు సిబ్బంది ఉన్నారు. నేటి నుండి 30 యాక్టు అమలు నిర్మల్ జిల్లాలో డిసెంబర్ 1నుండి 31 వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో 30, 30(ఏ) యాక్టు అమలు ఉంటుందని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ప్రజలు ప్రజా ప్రదినిధులు సభలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. ప్రజాదనంకు నష్టం కలిగించే ఏ పనులు చేసిన చట్టం పరధిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు పోలీసు శాఖకు సహాకారం అందించాలని శాంతి భద్రతల విషయంలో ఉల్లంగిస్తే చర్యలు తప్పవన్నారు.