calender_icon.png 15 October, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి జోలికి వెళ్తే కఠిన చర్యలు తప్పవు

15-10-2025 05:44:03 PM

రెబ్బెన (విజయక్రాంతి): గంజాయి సాగుచేసిన, వినియోగించిన, రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని ఎస్సై వెంకటకృష్ణ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు. దానిలో భాగంగా గ్రామాల్లో గంజాయిని సమూలంగా రూపుమాపేందుకు పోలీస్ శాఖ గట్టి నిఘా పెట్టిందన్నారు. గుట్టుగా పంట చేలలో గంజాయి మొక్కలు సాగు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, సాగు చేసే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు.

గంజాయిని సేవించిన, రవాణా చేసిన శిక్షార్హులని అన్నారు. మండలంలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక సిబ్బంది ద్వారా నిఘా పెట్టమన్నారు. ప్రధానంగా గ్రామాల్లో యువత గంజాయి బారినపడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు.  ప్రత్యేక కిట్లను ఉపయోగించి గంజాయి సేవించే వారిని గుర్తిస్తామన్నారు. అందుకోసం ప్రత్యేక కిట్లను అందుబాటులో ఉంచమన్నారు. మండలంలోని ప్రజలందరూ గంజాయిని సమూలంగా రూపుమాపేందుకు పోలీసులకు సహకారం అందించాలన్నారు. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.