calender_icon.png 15 October, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆగదు

15-10-2025 05:48:03 PM

సిపిఐ ఆధ్వర్యంలో మునుగోడులో రాస్తారోకో..

మునుగోడు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించే జీవో నెంబర్ 9 ను 9త్ షెడ్యూల్లో చేర్చి ఆమోదించే వరకు సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి పోరాడుతుందని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గురిజా రామచంద్రం అన్నారు. బుధవారం మునుగోడు మండల కేంద్రంలో సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ నిలబెట్టుకోగా అసెంబ్లీలో మద్దతు తెలిపిన పార్టీలు కోర్టుల ముసుగులో అడ్డుకోవడం విచారకరమన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని బిజెపి తెలంగాణ బీసీ సమాజానికి ద్రోహం చేస్తుందని ఆరోపించారు.

60 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వం 42 శాతాన్ని రిజర్వేషన్ కల్పించగా తట్టుకొని బీసీ ద్రోహులు అడ్డుకుంటున్నారని వాటిని తిప్పికొట్టడంలో సిపిఐ కార్యకర్తలు ముందు ఉంటారని అన్నారు. ఈ నెల 18న తలపెట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొలుగూరి నరసింహ, తీర్పురి వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి చాపల శ్రీనివాస్, బీసీ హక్కుల సాధన సమితి నాయకులు ఈదులకంటి కైలాసం, మండల కార్యవర్గ సభ్యులు, మందుల పాండు, బండమీది యాదయ్య, మాధగోని సత్తమ్మ, ఉప్పునూతల రమేష్, దుబ్బ వెంకన్న, రేవెల్లి అంజయ్య, తీర్పారి కృష్ణయ్య, కట్కూరి లింగస్వామి, కట్ట దశరథ, తిరందా శ్రీనివాసులు, ఎండి జానీ, యాదయ్య ఉన్నారు.