17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

పకడ్బందీగా భూభారతి చట్టం

10-06-2025 11:09 PM

భూభారతి రెవెన్యూ సదస్సులో కిష్టా నాయక్..

హన్వాడ: భూభారత్ చట్టం పకడ్బందీగా అమలు జరుగుతుందని హన్వాడ తహసీల్దార్ కిష్ట నాయక్(Tehsildar Kishta Naik) అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పెద్దదర్ పల్లి గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన పలు ఫిర్యాదులను తహసీల్దార్ కిష్ట నాయక్ స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... భూభారతి ప్రతి ఒక్కరి భూములకు భద్రత కల్పిస్తుంది అని తెలిపారు. అక్రమాలకు తావు లేకుండా భూములకు రక్షణ కవచముల భూభారతి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామస్వామి గౌడ్, చంద్రశేఖర్, రఘురాం గౌడ్, సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారు.