సైబరాబాద్‌లోని విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు
27-06-2026 12:00 AM
-సీపీ డా.ఎం.రమేష్ ఆదేశాలు
శేరిలింగంపల్లి, జూన్ 26 (విజయక్రాంతి): విద్యార్థులు, యువతలో మాదక ద్రవ్యాల వాడకం పెరుగుతుండటంతో సైబ రాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి విద్యా సంస్థ యాంటీ-డ్రగ్ కమిటీ ఏర్పాటు చేసి, ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు.
క్యాంపస్లో వార్నింగ్ బోర్డులు ప్రదర్శించి, అవగాహన సమావేశాలు, సెమినార్లు నిర్వహించి మాదక ద్రవ్యాల సంబం ధం ఉన్న వారిని వెంటనే పోలీసులకు తెలియజేయాలని, డయల్- 112 లేదా హెల్ప్ లైన్లు 8712663333, 8712663236, 040-27853412కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఆదేశాలు జూన్ 26 నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.ఈ నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టినా ఎన్పిడీఎస్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.






