మియాపూర్ సీఐ శివప్రసాద్ సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్
శేరిలింగంపల్లి, జూన్ 26 (విజయక్రాంతి): మియా పూర్ పోలీస్ స్టేష న్ సీఐ శివప్రస్పా సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రాగా, సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు అతన్ని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. మియాపూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి భవన యజమానితో జరిగిన సివిల్ వివాదంలో ఇన్స్పెక్టర్ శివప్రసాద్ అనధికారికంగా జోక్యం చేసుకున్నారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి.
ఇన్స్పెక్టర్ శివప్రస్పా బదిలీ వేటు కూడా పడినట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని సైబరాబాద్ సీపీ కార్యాలయంలో అటాచ్గా ఉంచుతూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఈ చర్యలు మియాపూర్ ప్రాంతంలో పోలీస్ అధికారులు సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టమైన సందేశం ఇస్తున్నట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.






