2 July, 2026 | 12:28 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

‘శాతవాహనలో ఒప్పంద సహాయ ఆచార్యుల సమ్మె సైరన్‘

23-04-2025 12:55 AM

కరీంనగర్, ఏప్రిల్22(విజయక్రాంతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం సహాయ ఆచార్యుల నిరవధిక సమ్మె ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్ గా కాంట్రాక్ట్, పార్ట్ టైం సహాయ ఆచార్యులని రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్ తో, 12 విశ్వవిద్యాలయాలలో సుమారు 1200 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం గా పనిచేస్తున్నారని, రెండు దశబ్దాల కాలంగా విశ్వవిద్యాలయలలో తమ శ్రమతో,

చాలీచాలని జీతాలతో పనిచేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తూ విశ్వవిద్యాలయాలను కాపాడుకుంటూ వచ్చామని ఇన్ని సంవత్సరాల తమ కృషిని, కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ నిరవధిక సమ్మెలో గోదావరిఖని పీజీ కళాశాల, విశ్వవిద్యాలయ ఫార్మసీ కళాశాల,

విశ్వవిద్యాలయ ఆరట్స్ సోషల్ సైన్సెస్, విశ్వవిద్యాలయం కామర్స్- బిజినెస్ మేనేజ్మెంట్,  విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం సహాయ ఆచార్యులు సుమారు 39 మంది విశ్వవిద్యాలయ ఆవరణలో టెంటు వేసి ప్రారంభించారు. వివిధ విశ్వవిద్యాలయాలతో పాటు ఈ నిరవధిక సమ్మెకు శాతవా హన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులూ తమ సంఘీభావం వ్యక్తం చేశారు. శాతవాహన విశ్వ విద్యాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్ అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బందీ తమ మద్దతును తెలిపారు.