24 April, 2026 | 5:22 PM

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి

24-04-2026 03:50 PM

ఎమ్మెల్యే మందుల సామేలు, టిపిసిసి ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య

తుంగతుర్తి (విజయ క్రాంతి): రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, టిపిసిసి ఉపాధ్యక్షులు కొండేటి మల్లయ్య అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 6 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయన్నారు.

నియోజకవర్గంలో సుమారు 2000 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ కింద సిసి రోడ్లు, వేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్న అని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి 3500 రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కానున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ జడ్పిటిసి నిలబడే అభ్యర్థుల పేర్లను ముందస్తుగా గుర్తించి, ప్రత్యేక సమావేశంలో పొందపరిచి, అభ్యర్థుల ప్రక్రియ జగనన్నట్లు తెలిపారు. పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లకు ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రగులుతున్న నిప్పురవ్వ రేవంత్ రెడ్డి, అని ఒక పద్య రూపంలో పాడి, కార్యకర్తల్లో జోష్ నింపారు.

ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు గుడిపాటి నరసయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, డిసిసి ఉపాధ్యక్షులు యోగానంద చారి, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ నాగం సుధాకర్ రెడ్డి తోడుసు లింగ యాదవ్ ఆవిలమల్లు యాదవ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బికోజి నాయక్, రేగటి రవి గౌడ్, దాయం ఝాన్సీ రెడ్డి, పెదబోయిన అజయ్ కొండారాజు మాచర్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.