24 April, 2026 | 5:48 PM

విద్యుత్ ప్రమాద బాధితులకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి భరోసా

24-04-2026 04:00 PM

కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకున్న విద్యుత్ ప్రమాద బాధితులను నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి, వారి సతీమణి పట్లోళ్ల అనుపమ రెడ్డి బాధితులను పరామర్శించారు. బీబీపేట్ గ్రామానికి చెందిన కాండ్రపల్లి సుశీల, భర్త సాయిలు నివాసం ఉంటున్న ఇళ్ళు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైందన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలిచారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన సుశీల కుటుంబానికి ఎమ్మెల్యే తన వంతుగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

కుటుంబ పోషణకు ఇబ్బంది కలగకుండా బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను స్వయంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బాధితులకు ప్రభుత్వం తరపున కూడా పూర్తి స్థాయిలో సహాయం అందేలా చూస్తానని, ఎవరూ అధైర్యపడవద్దని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి రోడ్డున పడ్డ పేద కుటుంబాలను ఆదుకోవడం మన అందరి బాధ్యత. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే బరోసానిచ్చారు. అయన వెంట గుండు స్వప్న మోహన్ మాజీ జడ్పీటీసీ, సాయిలు గ్రామ సర్పంచ్, పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.