calender_icon.png 7 September, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గనుల్లో భద్రత పెంపునకు పటిష్ట చర్యలు

01-09-2025 12:43:02 AM

-ప్రమాద రహిత సంస్థగా సింగరేణి కార్మిక సంఘాల సూచనలను పరిగణలోకి తీసుకుంటాం 

-రక్షణ త్రైపాక్షిక సమావేశంలో సీఎండీ బలరామ్ నాయక్

మంచిర్యాల, ఆగస్టు 31 (విజయక్రాంతి) : గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకొని అవసరమైన చర్యలను తక్షణమే తీసుకుంటామని సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ (సీఎండి) ఎన్ బలరామ్ నాయక్ తెలిపారు.

ఆదివారం ఎంఎన్‌ఆర్ గార్డెన్స్ లో జరిగిన 49వ రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ అధికారులు, గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల ప్రతినిధులు, సింగరే ణి అధికారులను ఉద్దేశించి సిఎండీ ప్రసంగించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తిలో ఆద ర్శప్రాయంగా ఉందని, అలాగే రక్షణలో కూడా ప్రమాద రహిత కంపెనీగా రూపుదిద్దాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు.

ప్రతి కార్మికుని ప్రాణాలు ఎంతో విలువైనవని, ప్రమాదాలు జరగకుండా, ప్రమాదా లను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, అలాగే యాజమాన్యంతో పాటు కార్మికులు కూడా రక్షణను ఖచ్చితంగా పాటించాలని కోరారు. ప్రాణనష్టం చాలా ప్రమాదాల్లో నిర్లక్ష్యం, నిర్లిప్తత వల్లే చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షణ లేని పని ప్రదేశాల్లో విధులు నిర్వహించమని యాజమాన్యం ఎప్పుడూ ఒత్తిడి చేయబోదని, అదే సమయంలో ప్రతీ ఒక్కరూ కూడా స్వీయ రక్షణ అత్యంత ము ఖ్యమన్న విషయాన్ని గ్రహించాలని సూచించారు. మహిళా ఉద్యోగులకు అన్ని సౌకర్యా లు కల్పిస్తున్నామన్నారు. వారి రక్షణ తప్పని సరిగా సంస్థ చూసుకుంటుందన్నారు.

సూచనలు చేసిన కార్మిక సంఘాలు..

గనుల్లో రక్షణ పెంపుదలకు కార్మిక సంఘాలు అనేక సూచనలు చేశాయి. నాణ్యమైన హెల్మెట్లు, బూట్లు సరఫరా చేయాలని, వైద్య సేవలు పెంపుదల, క్యాంటీన్లలో మెరుగైన సౌకర్యాలు, కొత్త యంత్రాల కొను గోలు, ఆధునీకరణ, అవసరమైన సిబ్బంది నియామకం వంటి అనేక అంశాలపై గుర్తిం పు కార్మిక సంఘం ఏఐటియుసి యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఐ ఎన్ టి యు సి జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్, ఇతర నాయకులు సింగరేణి వ్యాప్తంగా రక్షణ పెంపుదలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.

అనంతరం సంస్థ డైరెక్టర్లు ఈ అండ్ ఎం డి సత్యనారాయణ రావు,  ఆపరేషన్స్ ఎల్‌వీ సూర్యనా రాయణ, ప్లానింగ్ అండ్ ప్రాజెకట్స్ కె వెంకటేశ్వర్లు, పీ ఏ అండ్ డబ్ల్యూ గౌతం పొట్రూ రక్షణ చర్యలపై ప్రసంగించారు. జనరల్ మేనేజర్ సేఫ్టీ (కార్పొరేట్) చింతల శ్రీనివాస్ రక్షణ నివేదికను సమర్పించారు.అనంతరం ఇటీవల పలు ప్రమాదాలలో మృతి చెందిన కార్మికులకు సంతాపం ప్రకటించారు.

డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ (సేఫ్టీ) ఉజ్వల్ థా అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ (సేఫ్టీ) టిఆర్ కన్నణ్, డైరెక్టర్ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్) డి సత్యనారాయణ రావు, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెకట్స్) కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పీఏ అండ్ డబ్ల్యూ) గౌతమ్ పాట్రు, ఎస్సీడబ్ల్యూయు ప్రెసిడెంట్ వి. సీతారామయ్య, ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్, ఐఎన్టియుసి జనరల్ సెక్రెటరీ బి. జనక్ ప్రసాద్, ప్రెసిడెంట్ సియంఓఏఐ టి. లక్ష్మీపతి గౌడ్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్), అశోక్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్) ఉమేష్ యం సావర్కర్, ఎన్. నాగేశ్వర రావు, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్ట్ (ఎలక్ట్రికల్) రాజ్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (ఎలక్ట్రికల్) ఎస్ ఆనంద వేల్, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మెకానికల్) పి.కె. జైన్, జనరల్ మేనేజర్ సేఫ్టీ కార్పొరేట్ సి.హెచ్. శ్రీనివాస్, జనరల్ మేనేజర్ సిపిపి మనోహర్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ సుభాని, శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ యం. శ్రీనివాస్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.