07-09-2025 01:47:35 PM
దక్షిణ కొరియా: గ్వాంగ్జులో ఆదివారం హోరాహోరీగా ఆర్చరీ కాంపౌండ్ మిక్స్ డ్ టీమ్ ఫైనల్(Archery Compound Mixed Team Final) పోరు జరిగింది. ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, భారత పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో(World Archery Championship 2025) తొలి బంగారు పతకాన్ని గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. రిషబ్ యాదవ్, అమన్ సైని, ప్రథమేష్ ఫుగే త్రయం తమ ధైర్యాన్ని నిలుపుకుంటూ ఫ్రాన్స్‌ను 235-233 తేడాతో ఓడించింది. ఫైనల్‌కు చేరుకునే ముందు, భారతదేశం ఆస్ట్రేలియా, పవర్‌హౌస్ యుఎస్ఏ, టర్కీలపై అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. అంతకుముందు రోజు ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో వెన్నం జ్యోతి సురేఖ, రిషబ్ యాదవ్‌లతో కూడిన భారత మిశ్రమ జట్టు రజత పతకాన్ని గెలుచుకుంది. ఫైనల్ లో నెదర్లాండ్స్ జోడీ చేతిలో 157-155 తేడాతో ఓడిపోయారు.