01-09-2025 12:43:04 AM
యాదాద్రి భువనగిరి ఆగస్టు 31 ( విజయ క్రాంతి ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మూడంపల్లి వాగులో ప్రమాదవశాత్తు మృతి చెందిన కే జహంగీర్ కుటుంబానికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన దేవనూరి బాలయ్యలకు తాజ్పూర్ గ్రామ టిఆర్‌ఎ స్ పార్టీ నాయకులు గ్రామస్తులు బాసటగా నిలిచి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
జహంగీర్ కుటుంబానికి 20 వేలు, బాలయ్య కు మాజీ ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, గ్రామ యువకులు పార్టీ కార్యకర్తలు కలిసి 30 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని ఆ పార్టీ జిల్లా నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు డాక్టర్ రేఖల శ్రీనివాస్ ఆదివారం నాడు వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేష్, పార్టీ నాయకులు రమేష్ గౌడ్, వేణు గౌడ్ వార్డు మెంబర్లు గ్రామస్తులు పాల్గొన్నారు.