స్ట్రాంగ్ రూం సెక్యూరిటీ గన్ మిస్‌ఫైర్

29-04-2024 12:57:11 AM

కానిస్టేబుల్ కాలికి తీవ్రగాయం

వరంగల్ తూర్పు, ఏప్రిల్28 (విజయక్రాంతి): ఈవీఎం స్ట్రాంగ్ రూంలకు భద్రతా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్  గన్ మిస్ ఫైర్ కావడంతో కాలిక తీవ్రగాయమయ్యింది. వరంగల్ ఏనుమాముల మార్కె ట్ యార్డులోని 12వ నంబర్ గోదాములో ఎన్నికల కోసం ఈవీఎంలను భద్రపరిచారు. ఏఆర్ విభాగం పోలీసు సిబ్బంది ఈవీఎంలను పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం విధులు నిర్వహిస్తు న్న... ఏఆర్ కానిస్టేబుల్  అరికట్ల రాజేష్(32) తాను వినియోగిస్తున్న ఇన్‌సాస్ మిషన్ గన్ ని శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా మిస్‌ఫైర్ అవ్వడంతో, రాజేష్ ఎడమ కాలుకు తీవ్రగా యం అయ్యింది. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది బాధితుడిని ఎంజీఎం హాస్పటల్‌కి తరలించి, వైద్య సేవలు అందించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానేవుందని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఏనుమాముల పోలీ సులు తెలిపారు.