7 June, 2026 | 1:57 AM

డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం

07-06-2026 12:00 AM
  1. యార్డ్ బాధిత ప్రాంతాల్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించండి     
  2. జవహర్‌నగర్‌లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచండి
  3. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు

జవహర్‌నగర్, జూన్ 6 (విజయక్రాంతి): పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపిం గ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని, డంపింగ్ యార్డ్ బాధిత ప్రాంతాల్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మించాలని జవహర్ నగర్ లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను  మెరుగుపరచాలని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ స్పష్టం చేసింది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ లోని దళిత సంక్షేమ భవన్లో, వివిధ రాజకీయ పార్టీలు మీడియా మిత్రులు ప్రజాసంఘాల నేతలు శనివారం సమావేశమై డంపింగ్ యార్డ్ సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇఫ్టు జాతీయ కార్యదర్శి షేక్షావలి, మల్లేష్ ఐఎఫ్టియు, శివ బాబు టియుసిఐ ప్రవీణ్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ జవహర్ నగర్‌లో గాలి నీరు భూమి వాయువులు మొత్తం కలుషితమయ్యాయని, ప్రజలు ఇకనైనా మేలుకోకుంటే జవహర్ నగర్ మరో హిరోషిమా నాగసాకి నగరంలాగా తయారయ్యి పర్యావరణ సమతుల్యత దెబ్బతిని మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉందన్నారు.  జవహర్ నగర్ ప్రాంతంలో చాలా బస్తీల్లో డ్రైనేజీ మంచినీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జవహర్ నగర్ వాసులతోపాటు డంపింగ్ యార్డ్ బాధితుల ఆరోగ్యం కొరకు వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.

లేనియెడల డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సంసిద్ధులు అవుతామని తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట కమిటీని ఏర్పాటు చేశారు. పోరాట కమిటీ చైర్మన్గా ఇఫ్టు షేక్షావలి, కన్వీనర్‌గా ఉమా మహేష్, గౌరవ సలహాదా రులుగా మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ రావల్కోల్ నరసింహ గౌడ్, కల్లేపల్లి సదానందం, తదితరులు ఎన్నికయ్యారు.

అనంతరం ఈ కార్యక్రమంలో సిపిఐ మాజీ ఎంపీటీసీ తోటపల్లి శంకర్, సిపిఎం శివన్నారాయణ, బి.ఎస్.పి ఏక స్వామి, మాజీ మేయర్ మేకల కావ్య, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండల ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు ఆలూరి రాజశేఖర్, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, మేకలలిత యాద వ్, ఆంజనేయులు, అనురాధ, జయసుధ, వై. మల్లేష్, పాషామియా, జయ, అల్లూరి సావిత్రి, జాన్, చంద్రమౌళి, పెరక సునీత, స్వరూప, లక్ష్మి, సామాజిక సేవకుడు బూడిద వెంకటేష్, ప్రతాప్, యాదగిరి, రాణి, శంకర్, లక్ష్మణ్, నరసింహ, నర్సింగరావు, సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు.