09-09-2025 12:03:41 AM
జాతీయ మాలమహానాడు పొలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య
మంగపేట, సెప్టెంబరు 8 (విజయక్రాంతి): అరచేయి అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు ముందస్తు అరెస్టులతో మా పోరాటాలు ఆపలేరని జాతీయ మాలమహానాడు పొలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య అన్నారు. సోమవారం తలపెట్టిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి బయలుదేరిన నాయకులను అక్రమ అరెస్టులతో నిర్బంధించడం హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిసారించి జీవో నంబర్ 99 ని సవరించిరోస్టర్ పాయింట్ 22 నుంచి 16కు తగ్గించి మాల విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలోరాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు చిట్టిమల్ల సమ్మయ్య రాష్ట్ర కార్యదర్శి నిమ్మగడ్డ ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు కర్రీ శ్యాంబాబు, మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర కుమార్, జిల్లా నాయకులు కర్రీ శ్రీను, బియ్యం శ్రీను, గంగేర్ల వెంకటేశ్వర్లు, జానపట్ల జయరాజు ఉన్నారు.