calender_icon.png 9 September, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలో ఘోరం

09-09-2025 12:03:53 AM

  1. ఎలుకలు కరిచి 7మందికి గాయాలు 

అస్వస్థకు గురైన విద్యార్థినిలు 

మూసి ఉంచిన ప్రిన్సిపాల్

విద్యార్థినిలను ఆసుపత్రికి తరలింపు

అందరూటెన్త్ క్లాస్ విద్యార్థులే

గోపాలపేట సెప్టెంబర్ 8 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు బలోపేతం చేసేందుకు ప్రభు త్వం ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి గు రుకుల పాఠశాలలను ఏర్పాటు చేసింది. అక్కడ చదువుకునే అందరూ పేద విద్యార్థు లే. నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వివిధ రంగా లలో రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలకు కోట్ల రూపాయలు వె చ్చించి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. కానీ వనపర్తి జిల్లా గోపాలపేట మండలం బుద్ధారం సాంఘిక సంక్షేమ పాఠశాల మా త్రం విరుద్ధంగా ఉంది.

ఈ బుద్ధారం సాం ఘిక సంక్షేమం పాఠశాలలో 5వ తరగతి నుండి పదవ తరగతి వరకు సుమారుగా 400 పైసలుకు విద్యార్థినిలు ఉన్నారు. అదేవిధంగా ఇంటర్ మొదటి రెండవ తరగతి వి ద్యార్థులు 200 మంది విద్యను ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదువుతున్నారు. అక్క డి సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది.

సాంఘిక సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ ఆరోగ్యం విద్యార్థినిలను ఏ మి పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఎ న్నో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలలో గద్వాల్ నాగర్ క ర్నూల్ కొల్లాపూర్ వనపర్తి అచ్చంపేట జిల్లా కు చెందిన విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. పాఠశాల అస్తవ్యస్తంగా ఉండడంతో ఎలుకలు పందికొక్కులు అధికమైనట్లు తెలుస్తుంది.

అర్ధరాత్రి ఘోరం జరిగింది...

పదవ తరగతి విద్యార్థులు రాత్రి భోజ నం ముగించుకుని ఒకే గదిలో నిద్రించారు. విద్యార్థినిలు గాఢ నిద్రలో ఉండగా పెద్ద పెద్ద ఎలుకలు విద్యార్థినిలను ఖరిచాయి. వెంటనే ఆ రాత్రే ప్రిన్సిపాల్ ఆరోగ్యం కు విద్యార్థినీ లు తెలిపారు. అయినా ఆ ప్రిన్సిపాల్ ఏం కా దులే అంటూ నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నారని విద్యార్థులను బెదిరించినట్లు తెలుస్తుంది.

ఉదయం 9 గంటలకు అందులో ఉన్న ఏఎన్‌ఎం తో చికిత్స చేయించింది. కానీ ఆ ప్రి న్సిపాల్ ఆరోగ్యం మాత్రం ఈ విషయాన్ని బయటకు పోకుండా దాచిపెట్టి ఎవరి క్లాస్ లకు వారు వెళ్లిపోండి అని చెప్పడంతో వి ద్యార్థులు వెళ్లిపోయారు. మధ్యాహ్నం సమయంలో ఎలుకలు కరిచిన విద్యార్థులు అస్వ స్థకు గురై క్రింద పడిపోయారు...

ఎలుకలు కరిచి గాయాలైన విద్యార్థులు 

వనపర్తి జిల్లా లక్ష్మీదేవి పల్లికి చెందిన శశిరేఖ, నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి చెంది న భవాని, కొల్లాపూర్ నియోజక వర్గం మై లారం చెందిన జ్యోత్స్న, వనపర్తి జిల్లా చిమ్నగుంటపల్లికి చెందిన కీర్తన, వనపర్తి జిల్లా పామిరెడ్డిపల్లికి చెందిన స్నేహ, గద్వాల జిల్లా కొత్తపల్లికి చెందిన ప్రసన్న కొల్లాపూర్ కు చెందిన సౌమ్య, లు ఆస్పత్రి పాలయ్యారు.

వీరందరినీ మధ్యాహ్నం రెండు తర్వాత గో పాలపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ చాంద్ పాషా విద్యార్థినిల కు చికిత్స చేసి టీటీ ఇంజక్షన్లను చేశారు. వా రం రోజులపాటు మాత్రలు వాడుతూ జాగ్రత్తగా ఉండాలని విద్యార్థినిలకు సూచించారు.

తల్లిదండ్రులు ఆగ్రహం ...

ఎక్కడెక్కడ నుంచో మా పిల్లలను చదువుకోవడానికి ఈ సాంఘిక సంక్షేమ పాఠశా ల బాగుంటుందని మా పిల్లలు బాగా చదువుకుంటారని పంపించాము కానీ ఇక్కడ ప్రిన్సిపాల్ విద్యార్థులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండడంతో విద్యార్థినిల తల్లిదండ్రులు ఆగ్రహిస్తూ వెంటనే ఈ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పాఠశాల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి గ్రామస్తులు ..

విద్యార్థులు ఎలా ఉన్నారని పర్యవేక్షణ లేకుండా నిర్లక్ష్యంగా ఉన్న ఈ ప్రిన్సిపాల్ పై ప్రభుత్వం వెంటనే స్పందించి సస్పెండ్ చేయాలని బుద్ధారం గ్రామస్తులు డిమాండ్ చేశారు లేకుంటే ఇక్కడి నుంచి ఈ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకొని ఈ పాఠశాల నుండి మరో పాఠశాలకు పంపించాలని ప్రభుత్వాన్ని ఉన్నత విద్యాశాఖను కోరారు.

ప్రిన్సిపాల్ కు చెప్పాము ఏమి కాదని చెప్పారు ... 

రాత్రి భోజనం చేసి గదిలో అందరం కలిసి పడుకున్నాము అర్ధరాత్రి ఎలుకలు వచ్చి కరిచాయి ఈ విషయాన్ని మా మేడం కు చెప్పాము ఎలుకలు కరిచాయి మేడం నొప్పిగా ఉందని చెప్పగా ఏమీ కాదులే అని సమాధానం చెప్పింది.

కీర్తన 10వ తరగతి 

ఎలుకలను చూస్తే భయం వేస్తుంది.. 

ఈ పాఠశాలలో ఎలుకలు చాలా తిరుగుతుంటాయి మా పుస్తకాల పెట్టె లో కూడా ఉన్నాయి వాటి గురించి ఎవ రూ పట్టించుకోవడం లేదు ఆ పెద్దపెద్ద ఎలుకలను చూస్తే భయం వేస్తుంది.

శశిరేఖ పదవ తరగతి