calender_icon.png 21 September, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ టి యు నూతన కార్యవర్గం ఎన్నిక

21-09-2025 07:35:22 PM

బెజ్జంకి: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం బెజ్జంకి మండల ఎస్ టి యు నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నిక జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ శ్రీధర్ పర్యవేక్షణలో కోహెడ మండల ప్రధాన కార్య దర్శి హరిదాసు ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. మండల అధ్యక్షుడిగా నారోజు శంకరాచారి, ప్రధాన కార్యదర్శిగా యాలాల రాజమల్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఉంద్రాళ్ల తిరుపతి, కె. సతీశ్,  జిల్లా కౌన్సిలర్లు వడ్లకొండ శ్రీనివాస్, రామంచ రవీందర్ తదితరులు ఎన్నికయ్యారు.